సెలవుల్లో స్కూల్..9th క్లాస్‌ స్టూడెంట్‌ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్

415
ktr twitter
- Advertisement -

భానుడి ప్రచండ ఉష్ణోగ్రతలతో తెలంగాణ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. భానుడి సెగలు, ఉక్కపోతల మధ్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఎండల తీవ్రతకు సోమవారం ఒక్కరోజే 40 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఎండల నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవులను పొడగించింది. జూన్ 11 వరకు విద్యాసంస్థలకు సెలవులిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు కొన్ని విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన ఓ విద్యార్థి కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. సార్ ఎండల దృష్ట్యా మీరు సెలవులు పొడిగించారు. కానీ మా స్కూల్ యాజమాన్యం ఆ విషయం పట్టించుకోకుండా స్కూల్ రన్ చేస్తోంది. ఎండల్లో జర్నీ చేయలేకపోతున్నాం అంటూ ట్వీట్ చేశారు.

విద్యార్ధి ట్వీట్‌కు వెంటనే స్పందించారు కేటీఆర్. వేసవి సెలవుల పొడిగింపుని ప్రతీ విద్యాసంస్థ అమలుపరిచేలా చూడాలని విద్యాశాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తూ రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్ వెంటనే స్పందించడంపై నెటిజన్లు ఆయన్ని మెచ్చుకుంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

https://twitter.com/KTRTRS/status/1133226956982407168

- Advertisement -