వరి తగ్గించుకోండి- మంత్రి జగదీష్ రెడ్డి

425
Jagadish Reddy
- Advertisement -

వరి పంట తగ్గించుకుని ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధర లభించదని ఆయన తేల్చిచెప్పారు.ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కందికి రంది లేదని ఆయన స్పష్టం చేశారు నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులో బాగంగా గురువారం సాయంత్రం సూర్యపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సూర్యపేట నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని రైతులు పండించిన పంటకు రైతులే ధర నిర్ణయించుకునేలా ఉండేందుకే నియంత్రిత సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారిస్తున్నారన్నారు. ఇది సాహసోపేతమైన నిర్ణయమని ఇంత వరకు ఏ ఒక్కరు ఈ దిశగా ఆలోచనే చేయలేదన్నారు. వానాకాలంలో మొక్క జొన్నలు వెయ్యడం శ్రేయోస్కారం కాదని ఆయన తేల్చిచెప్పారు.

వానాకాలంలో ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే అదే మొక్కలు యాసంగిలో 45 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు.అధ్యయనం చేసిన మీదటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.యావత్ భారతదేశం వరి వైపు చూస్తోందని అదే జరిగితే డిమాండ్ తగ్గి ధర పలకదని ఆయన వివరించారు.వరిలో కూడా సన్నాలు వెయ్యడం రైతుకు మేలు చేస్తుందన్నారు. ఇదే విషయంపై స్వామినాథన్,జయత్ ఘోష్ లు అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు.

కొనేందుకు మిల్లర్లు సిద్దంగా ఉన్నారని సన్నాలలో తేమ శాతం పంచాయతీ అసలు ఉండదని ఆయన చెప్పారు.రైతుబంధు ప్రతి ఒక్కరికి అందుతుందని అయితే వేసిన పంట వివరాలను విధిగా నమోదు చేసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ,జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -