బండి ఓటమి.. కథ ముగిసినట్లేనా?

46
- Advertisement -

బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. కరీంనగర్ నుంచి పోటీ చేసిన ఆయన బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. బండి పై గంగుల 10,141 ఒట్ల మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూసిన బండి ఈసారి కూడా ఓడిపోవడం గమనార్హం. తెలంగాణలో బీజేపీ బలపడడంలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్.. మొదటి నుంచి కూడా తన గెలుపుపై అనుమానంగానే ఉన్నారు. మొదట ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ అధిష్టానం ఒత్తిడి మేరకు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి మరోసారి ఘోర ఓటమి చవిచూశారు.

బండి సంజయ్ ఓటమితో బీజేపీలో ఆయన పాత్ర ముగిసిపోనుందా ? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసిన క్రెడిట్ బండికే లభించినప్పటీకి.. ఆయనను అనూహ్యంగా అధ్యక్ష పదవి నుంచి తప్పించింది అధిష్టానం, దాంతో అప్పటి నుంచి పార్టీలో అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఆ తరువాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు బాద్యతలు అప్పగించినప్పటికి మునుపటి జోష్ లో మాత్రం కనిపించలేదు. దాంతో కమలం పెద్దలు కూడా బండి సంజయ్ ని లైట్ తీసుకున్నారనే వార్తలు గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓటమి చవి చూడడంతో ఇక ఆయన పాత్ర కమలం పార్టీలో పూర్తిగా మసకబారే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read:KTR:కాంగ్రెస్‌కు గుడ్ లక్‌

- Advertisement -