తమన్నా మరో ఐటెం సాంగ్….

195
Junior NTR-Tamanna
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమాకు మరో అట్రాక్షన్ జతకానుంది. అదేమిటంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఒకరు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా.తమన్నా ఒక వైపున స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే .. మరో వైపున స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తోంది. ‘అల్లుడు శీను’ .. ‘జాగ్వార్’ వంటి సినిమాల్లో కొత్త కథానాయకుల కాంబినేషన్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం.

Junior NTR-Tamanna

డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందబోయే ఈ పాటకు తమన్నా అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను ఫైనల్ చేశారట. తమన్నా కుడా ప్రపోజల్ నచ్చడంతో ఓకే చెప్పారట.ఇందుకోసం ఆమె భారీ మొత్తమే పారితోషికంగా అందుకోనుందని వినికిడి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది. ‘జనతా గ్యారేజ్’ లో “పక్కాలోకల్ .. “అనే స్పెషల్ సాంగ్ మాదిరిగానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ చెబుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ‘జై లవ కుశ’ సినిమా .. షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది.

- Advertisement -