అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం బన్నీకి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. బావ అంటూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
జన్మదిన శుభాకాంక్షలు అల్లు అర్జున్ బావ. ఈ సంవత్సరం నీకు మరింత శక్తి, ప్రేమతో పాటు మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నానంటూ ఎన్టీఆర్ తెలిపాడు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. బావ.. నీ అందమైన శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు. నీకు మరింత ప్రేమ, శక్తి కలగాలని కోరుకుంటున్నానంటూ బన్నీ రాసుకోచ్చాడు.
Also Read:బీజేపీకి రూ.2,243 కోట్ల విరాళాలు..!
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.
Many happy returns of the day Bava @alluarjun… May this year bring you more power, love, and milestones…
— Jr NTR (@tarak9999) April 8, 2025

