బాబాను ఉరి తీయాల్సిందే

183
Gurmeet Ram Rahim must be hanged says sadhus
- Advertisement -

అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ న్యాయస్థానం గుర్మీత్ రాం రహీం సింగ్‌కు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హర్యానా రాష్ట్రం పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ శిక్ష ఖరారు చేయనున్నారు. దీనిపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని వార‌ణాసి కి చెందిన సాధువులు స్పందించారు. రామ్ ర‌హీమ్ సింగ్ ను ఉరి తీయాల‌ని సాధువులంతా క‌లిసి డిమాండ్ చేశారు.

gurmeet2808

డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌సింగ్‌కు పడే శిక్ష గురించి సోమవారం న్యాయస్థాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో దిల్లీలో పోలీసులు అత్యంత అప్రమత్తత (హై అలర్ట్‌) ప్రకటించారు. నిఘాను తీవ్రతరం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు.

 మరోవైపు సునారియాలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతుండడంతో, హరియాణా, పంజాబ్‌లలో అన్ని విద్యాసంస్థల్నీ సోమవారం కూడా మూసివేశారు. అల్లర్లలో మృతిచెందినవారి సంఖ్య 36 నుంచి 38కి పెరిగిందనీ, మృతులందరి గుర్తింపు పూర్తయిందనీ హరియాణా డీజీపీ బి.ఎస్‌.సంధు తెలిపారు. హింసకు సంబంధించి 52 కేసుల్లో 926 మందిని అరెస్టు చేసినట్లు ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు.

followers-leave-dera_2d43ea70-8ba1-11e7-b1bc-83ce932a2009

సింగ్‌ను ఖైదు చేసిన కారాగారం చుట్టూ బహుళ అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తీర్పు వెలువడ్డాక ఎవరైనా ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదన్నారు. డేరా ప్రధాన కేంద్రం ఉన్న సిర్సా మినహా మిగిలిన అన్నిచోట్లా కర్ఫ్యూ ఎత్తివేశామని చెప్పారు. 103 డేరా కేంద్రాలను మూసివేయించామనీ, వీటి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, లాఠీలు, ఇంధనం సీసాలు, గొడ్డళ్లు, కొడవళ్లు, 66 పెప్పర్‌ స్ప్రేలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామనీ తెలిపారు.

- Advertisement -