74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ దేశాధినేతలు భారత ప్రభుత్వంకు మరియు మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం ప్రజల కోసం ఇజ్రాయెల్ దేశానికి ఎంబసీ అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ద్వారా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని వివిధ భాషాల్లో వారు ఏఐని ఉపయోగించుకొని భారతదేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇజ్రాయెల్ యొక్క డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఒహద్ నకాష్ కైనార్ పంజాబీలో మాట్లాడారు. మరియు ఇజ్రాయెల్ దేశ రాజకీయ సలహాదారు హగర్ స్పిరో తాల్ రాజస్థానీలో శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రతినిధి ముహమ్మద్ హేబ్ బెంగాలీలో, మరాఠీలో గలిత్ లారోచే ఫలాచ్ ప్రసంగించారు. షాలోమ్ నేను మీతో హిందీలో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇజ్రాయెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ కోరిక నేరవేరింది అని తెలిపారు.
భారత రాయబారి నౌర్ గిలోన్ మాట్లాడుతూ…మన రెండు ప్రాచీన నాగరికతల చరిత్ర ఆధారంగా భారతదేశం మరియు ఇజ్రాయెల్ గొప్ప వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి. మన ప్రజల మధ్య ప్రేమ మరియు గౌరవం దౌత్యానికి మించినది. అని తెలియజేస్తూ..భారతీయులందరికీ ఇజ్రాయెల్ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది అని అన్నారు.
ఇవి కూడా చదవండి…