వేములవాడకు ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుచేయండి:హరీష్

16
- Advertisement -

యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డుతో పాటు వేములవాడ ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో మాట్లాడిన హరీష్ రావు.. బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపరాఉ. రూ. 1800 కోట్లతో యాదగిరిగుట్టను కట్టించారని.. అయినప్పటికీ మంత్రి సురేఖ ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాను కానీ అనలేదు, ఆమె విజ్ఞత అన్నారు.

దేశంలో దేవుళ్ళని కొంతమంది రాజకీయ కోసం వాడుకుంటున్నారు.. అది వేరే విషయం, భువనగిరి యాదాద్రి జిల్లా కు ఒక మెడికల్ కాలేజి నిర్మించాలని అనుకున్నాం అన్నారు. భక్తులకు హెల్త్ ఎమర్జెన్సీ వస్తె ఇబ్బంది కావొద్దు అని ఏర్పాటు చేశాం అన్నారు.

కోనేరు లో కాళేశ్వరం జలాలు వచ్చాయి… బోర్డు లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు ఉండాలి అన్నారు. గిరిజన సభ్యుడు బోర్డు లో ఉండాలి అని.. ధర్మకర్తల బోర్డు అని కాకుండా ధర్మకర్తల మండలి గా మార్చాలి అన్నారు. భక్తి భక్తులను సక్రమమైన మార్గంలో పయనిస్తుంటారు.. హుండీ డబ్బుల నుంచి ఈవో, జే ఈవో లకు జీతాలు ఇవ్వాలి అన్నారు.

దక్షిణ కాశీ గా పేరుగాంచిన వేములవాడ కు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని… గంగలో ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన పాపాన పోలేదు అన్నారు. కానీ కేసిఆర్ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం.. విమాన గోపురానికి మేము కూడా బంగారం ఇచ్చాము అన్నారు.

Also Read:ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ తప్పనిసరి!

- Advertisement -