జపాన్ ప్రధానికి ఘోర అవమానం జరిగింది. సతీసమేతంగా ఇజ్రాల్ వెళ్లిన జపాన్ ప్రధాని అబెకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మంచి విందు ఏర్పాటు చేశారు. బెంజమిన్ కు ప్రత్యేకంగా వండిపెట్టే చెఫ్ మోషె సెర్గీ చేసిన వంటకాలు ప్రధాని అబెకు బాగా నచ్చాయి. డిన్నర్ పూర్తైన తర్వాత ఆ చెఫ్ ఇచ్చిన డెజర్ట్ వల్ల పెద్ద వివాదాస్పదం అయ్యింది.
ఆ చెఫ్ తళతల మెరిసిపోతున్న ఓ షూలో మంచిగా ముస్తాబ్ చేసి ఆ డెజర్ట్ ను తీసుకొచ్చాడు. ఆ షూలో పలు రకాలైన చాక్టెట్లు ఉన్నాయి. ఈ విధంగా తేవడాన్ని జపాన్ ప్రతినిధుల బృందం అభ్యతరం వ్యక్తంచేసింది. సాధారణంగా షూలను ఇంట్లోకి తీసుకురావడానికి ఇష్టపడము. అలాంటిది దేశ ప్రధానికి షూలో డెజర్ట్ ను సర్వ్ చేయడం దారుణమన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ అధికారులు కూడా దీనిని తప్పుబడుతున్నారు. ఇదొక మూర్ఖత్వపు చర్య అని ఆదేశ దౌత్యవేత్త అహ్రోనోత్ తెలిజజేశారు. అయితే అది నిజమైన షూ కాదని, ఓ లోహంతో తయారుచేసిన షూలాంటి ఆకారమని మోషె సెర్గీ వివరణ ఇచ్చారు. ప్రముఖ కళాకారుడు టామ్ డిక్సన్ దీనిని రూపొందిచినట్లు చెప్పాడు.