2019లో ప్రధానిని నేనే..

207
Ready to become Prime Minister in 2019
- Advertisement -

ప్రధాని మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే తానే ప్రధాని మంత్రి అవుతానని రాహుల్‌ సంచలన ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని పదవి మీరే చేపడతారా అంటూ అడిగిన ప్రశ్నకు రాహుల్ పైవిధంగా స్పందించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ బీజేపీ,మోడీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓ అవినీతి వ్యక్తిని ఎందుకు కర్ణాటక సీఎం అభ్యర్థిగా ప్రకటించారో మోడీ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. రూ. 35 వేల కోట్లు దోచుకున్న గాలి జనార్ధన్‌రెడ్డి అనుచరులకు ఎందుకు 8 సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. మోడీ సర్కార్‌పై ప్రజలు తీవ్ర
ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.

గతంలో కూడా ప్రధానమంత్రి పదవిపై రాహుల్ స్పందించారు. ప్రధాని బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధమని కూడా చెప్పారు. అలాగే గత నెలలో కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదని… ప్రధాని మోడీ కూడా వారణాసి నుంచి ఓడిపోతారని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైన బీజేపీని ఓడిస్తుందని కూడా అన్నారు. మళ్లీ ఇప్పుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -