సహజంగా ప్రోటీన్ ఇచ్చే పదార్థాలు ఇవే !

72
- Advertisement -

మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. కండరాలు దృఢంగా తయారవడంలోనూ, ఎముకలు శక్తివంతంగా తయారవడంలోనూ, అవయవాలు సక్రమంగా పని చేయడంలోనూ ప్రోటీన్ అవసరత చాలా ఉంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరానికి ప్రోటీన్ కొరత ఏర్పడుతుంది. బాడీలో ప్రోటీన్ లోపం వల్ల ఎన్నో సమస్యలు చుట్టూ ముడుతుంటాయి. శరీరం బలహీనంగా తయారవడం, తేలికపాటి బరువులు కూడా మోయలేకపోవడం, తరచూ నీరసంగా అనిపించడం.. ఇలాంటి సమస్యలు ఎన్నో చుట్టుముడతాయి.

Also Read:ఈ టిప్స్ తో ఈజీగా బరువు తగ్గండి..

అయితే ఈ ప్రోటీన్ లోపాన్ని అధిగమించేందుకు చాలమంది కృత్రిమంగా తయారు చేసిన ప్రోటీన్ పౌడర్స్ వాడడం, లేదా వివిధ మెడిసన్స్ వాడడం చేస్తుంటారు. అయితే మనం సహజంగా తినే ఆహార పదార్థాలనే సక్రమంగా తినడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్ పుష్కలంగా అందుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రోటీన్ లోపం అధికంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజూ పాలు, గుడ్డు వంటి వాటితో పాటు చికెన్, మటన్ వంటి మాంసకృతులను కూడా తినే ఆహారంలో జత చేసుకుంటే ప్రోటీన్ లోపాన్ని సులువుగా అదిగమించవచ్చు. గుడ్డు అనేది ఉత్తమ ప్రోటీన్ కారకంగా చెప్పుకోవచ్చు.

Also Read:ఎగ్జిట్ పోల్స్ : సంచలనం.. విజయం ఆ పార్టీదే !

ఇందులో ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, వంటి వాటితో పాటు శరీరానికి శక్తినేచ్చే అన్నీ రకాల ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. ఇక పాలు లేదా పాల ఉత్పత్తులలో కూడా ప్రోటీన్ శాతం అధికంగానే ఉంటుంది. పాలలో కాల్షియం, మెగ్నీషియం తో పాటు అన్నీ రకాల విటమిన్స్ కూడా లభిస్తాయి. మన శరీరంలో ప్రోటీన్ శాతాన్ని పెంచడంలో వేరుశనగ, బాదం, వంటివి కూడా ముఖ్యమైనవనే చెప్పుకోవచ్చు. ఇంకా ఆకు కూరలు, పప్పు దినుసులలో కూడా ప్రోటీన్లు అధికంగానే ఉంటాయి. అందువల్ల ప్రోటీన్ లోపం అధికంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజూ ఈ ఆహారపదార్థాలను తీసుకుంటే.. చాలా ఈజీగా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.

 

- Advertisement -