ఈ చిట్కాలు పాటిస్తే..ఆ సమస్యలన్నీ దూరం!

46
- Advertisement -

మన జీవన విధానంలో ఎన్నో సాధారణ ఆరోగ్య సమస్యలు మనలను తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు.. ఇలా ఎన్నో సమస్యలు చాలా సందర్భాల్లో వేదిస్తుంటాయి. అయితే ఈ సమస్యల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడూ కూడా వైద్యుడిని సంప్రదించి అధిక మొత్తంలో ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే మనం తరచూ ఎదుర్కొనే సాధారణ సమస్యలను వైద్యుడి సాయం లేకుండానే కేవలం వంటింటి చిట్కాలతోనే నయం చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం !

చాలా మందిని తరచూ వేదించే సమస్య పొడిదగ్గు. తీపి పదార్థాలు తిన్నప్పుడు లేదా జలుబు చేసినప్పుడు ఈ సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా 10ఏళ్ళ లోపు పిల్లలలో ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాము. అయితే పొడిదగ్గును తగ్గించడానికి అర టీస్పూన్ శొంఠి మరియు అర టీ స్పూన్ ఎలకల పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే పొడిదగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. మరొక విధానంలో అర టీ స్పూన్ ఆవాల పొడి ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకున్న ఈ పొడిదగ్గు సమస్య తగ్గిపోతుంది.

చాలా మందిని పంటినొప్పి సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. పంటినొప్పి వల్ల ఆహారం కూడా తినలేని పరిస్థితి. ఇంకా పంటినొప్పు ఉన్నప్పుడూ భరించలేని నొప్పితో సతమతమౌతుంటారు. అయితే చిన్న చిట్కా ద్వారా ఈ పంటినొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయిదు నుంచి ఆరు లవంగాల పొడి మరియు ఒక హారతి కర్పూరాన్ని కాటన్ క్లాత్ లో చుట్టి పంటినొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టి గట్టిగా నొక్కలి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

చాలా మందికి రుచికరమైన భోజనం చేసిన తరువాత అజీర్తి సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారికి ఇంగువ ఒక చక్కటి పరిష్కారం. చిటికెడు ఇంగువ మరియు చిటికెడు ఉప్పు కలిపి ఒక గ్లాస్ మజ్జిగ లో తీసుకుంటే అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు దూరమౌతాయి.

నేటి రోజుల్లో అధిక పని ఒత్తిడి కారణంగా తలనొప్పి తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికోసం ఈ చిట్కా. ఉసిరిక పొడి, శొంఠి, మిరియాల చూర్ణం నెయ్యి బెల్లంతో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే తలనొప్పి సమస్య తగ్గుతుంది. ఇంకా ఉసిరికాయ రసం, నిమ్మరసం, చక్కెర కలిపి రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకున్న తాళనాప్పి సమస్య దూరం అవుతుంది.

Also Read: గుమ్మడి కాయ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

( గమనిక : ఈ చిట్కాలు ఇంటర్నెట్ లోని ఆయుర్వేద సమాచారం మేరకు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించడం జరిగింది తప్పా వీటిని దృవీకరించడం లేదు. కాబట్టి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నప్పుడూ వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం. )

- Advertisement -