గ్రీన్ టీ ఎక్కువగా తాగితే.. ప్రమాదమా?

133
- Advertisement -

నేటి రోజుల్లో చామంది వేగంగా బరువు తగ్గడానికి సులువైన మార్గంగా ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తుంటారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. ఒత్తిడికి గురైనప్పుడు గ్రీన్ టి తాగడం వల్ల మెదడుకు ప్రశాంతత ను అందించి చురుకుదనాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించడంలో గ్రీన్ టి ముఖ్యపాత్ర పోషిస్తుంది. తద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. గ్రీన్ టి తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ శాతం పెరుగుతుందని పలు పరిశోదనలు చెబుతున్నాయి. అందువల్ల డయబెటిస్ నుంచి త్వరగా బయట పడే వీలు ఉంటుందట.

Also Read:బీజేపీలో మార్పు..సోము వీర్రాజు ఔట్?

అయితే గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయో అంతే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ ఒకసారి కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగడం వల్ల చిరాకు, నీరసం, తిమిర్లు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయట. ఇక అంతే కాకుండా గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల మైగ్రేన్ సమస్య ఏర్పడి తలనొప్పి వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే సమయంలో గ్రీన్ టీ తాగితే నిద్ర లేమి సమస్యలు వెండతే అవకాశం ఉందట. ఇక తరచూ గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ పని తీరు మందగించి కాలేయ సంబంధిత వ్యాధులు ఏర్పడతాయట. కాబట్టి బరువు తగ్గే ఉద్దేశంతో గ్రీన్ టీని అధికంగా సేవిస్తే తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంతా వరకు గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ప్రతిరోజూ ఒకసారి సేవిస్తే చాలని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:బీజేపీకి మరో షాక్.. రఘునందన్ గుడ్ బై ?

- Advertisement -