Pocharam:జిల్లాకో రైస్‌మిల్లు

41
- Advertisement -

ప్రైవేట్‌ మిల్లర్ల బాధలను తప్పించడానికి ముఖ్యమంత్రి జిల్లాకు ఒక రైస్ మిల్లును ఏర్పాటు చేయడానికి నిర్ణయించారని తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.కామారెడ్డి జిల్లా పాత బాన్సువాడ రోడ్డులో నూతనంగా నిర్మించిన వ్యవసాయ శాఖ సహాయ అధికారి కార్యాలయం, రైతుబంధు సమన్వయ సమితి కార్యాలయం, వ్యవసాయ శాఖ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం…రైతుబంధు డబ్బులు రావడంతో బీడు భూములు కూడా సాగులోకి వచ్చాయని తెలిపారు.రైతు పక్కకు తప్పుకంటే మిగిలిన రంగాలు, కుల వృత్తులు దెబ్బతింటాయి.రైతు తాను బతకడంతో పాటుగా పదిమందిని బతికిస్తాడు.మంచి పంటలు పండి, రైతుల దగ్గర డబ్బులు ఉంటే కొనుగోలు శక్తి పెరిగి వ్యాపార రంగం బాగుంటుందన్నారు.

Also Read:బీజేపీలో సంచలన మార్పులకు కారణం అదే.. !

రైతును కాపాడితే అన్ని కుల వృత్తులు, రంగాలను కాపాడినట్లేనని వెల్లడించారు. రైతులు ఆధునిక పద్దతులపై అవగాహన పెంచుకోవడంతో పాటుగా, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీలు ఉండగా అవసరమైన మరో 5 టీఎంసీలు ఇవ్వడానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

Also Read:బీజేపీలో మార్పు..సోము వీర్రాజు ఔట్?

- Advertisement -