బీజేపీకి మరో షాక్.. రఘునందన్ గుడ్ బై ?

84
- Advertisement -

తెలంగాణ బీజేపీ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతోంది. ముఖ్యంగా పార్టీ పదవుల విషయంలో నేతల మధ్య విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. పార్టీలో సరైన ప్రదాన్యం దక్కని నేతలు చాలమంది ఇప్పుడిప్పుడే వారి మనసులోని మాటలను బయట పెడుతూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీలోని లొసుగులను బయటపెట్టి పార్టీ నేతలను ఒక్కసారిగా ఉలిక్కిపాటు కు గురి చేశారు. అధ్యక్ష పదవి మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని చెప్పిన ఆయన.. తనకు అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వకూడదంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు.

పార్టీలో పదేళ్లుగా కష్టపడుతున్నానని తనకు సరైన ప్రదాన్యం కల్పించాలని చెప్పకనే చెప్పారు. కాగా చురుకైన మాటలతో పార్టీ పరంగా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రఘునందన్ గత కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలపై సైలెంట్ గా వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సంబంధించి ఏ కార్యక్రమం అయిన.. ఏ సమావేశం జరిగిన బండి సంజయ్ మరియు ఈటెల రాజేంద్ర మాత్రమే హైలెట్ అవుతున్నారే తప్పా రఘునందన్ పేరు మచ్చుకు కూడా వినిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆయన బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారనే సంగతి స్పష్టంగా అర్థమౌతోంది. ఇక తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆయన అసంతృప్తి క్లియర్ గా బయట పడింది.

Also  Read:కీరవాణి కెరీర్ మార్చిన సినిమా అదే

కాగా దుబ్బాక బైపోల్ లో ప్రజలు తనను చూసే గెలిపించారని, పార్టీని చూసి కాదని వ్యాఖ్యానించడం కొంత చర్చనీయాంశంగా మారింది. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ప్రదాన్యం ఇస్తూ.. ఎంతోకాలంగా పార్టీ కోసం కష్టపడుతున్న తనలాంటి వారికి ప్రదాన్యం దక్కడం లేదనే అసంతృప్తి రఘునందన్ లో కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని వీడే అవకాశాలు ఉన్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ప్రదాన్యం దక్కడం లేదని ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు పార్టీ వీడతారనే వార్తలు తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రఘునందన్ కూడా చేరడంతో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎటు దారి తీస్తాయో అర్థం కానీ డైలమాలో తెలంగాణ కాషాయ పార్టీ ఉంది.

Also Read:మహేష్ ఫ్యాన్స్‌కి రాజమౌళి ట్రీట్!

- Advertisement -