సీఎంగా పళని..డిప్యూటీగా విజయ్‌!

3
- Advertisement -

తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకేకు గట్టి పోటీని ఇచ్చేందుకు విజయ్ పార్టీ టీవీకే సిద్ధమవుతోంది. ఇక టీవీకేకు రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తుండగా వచ్చేసారి అధికారం టీవీకేదనని తేల్చిచెప్పారు కూడా. ఈ నేపథ్యంలో తన నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని స్పష్టంగా ప్రకటించాడు విజయ్‌.

దీంతో తమిళనాట ఆసక్తికర చర్చ మొదలైంది. డీఎంకే అధికారాన్ని నిలువరించాలంటే మంచి ఓటు బ్యాంకు కలిగిన అన్నాడీఎంకేతో పొత్తు అవసరమని పీకే వివరించినట్లు సమాచారం. అంతేగాదు అన్నాడీఎంకే అధినేత పళనిసామితో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అన్నాడీఎంకేకు కనీసం 25శాతం ఓట్లు, టీవీకేకు 20శాతం ఓట్లు రావచ్చని, అలాగే అన్నాడీఎంకే కూటమిలోని ఇతర చిన్న పార్టీలను చేర్చుకుంటే 50శాతం ఓట్ల మద్దతు పొందే అవకాశం ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ విశ్లేషించినట్లు చెబుతున్నారు.

ఒకవేళ పొత్తు కుదిరితే వి పళనిసామిని సీఎం, విజయ్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించే కూటమిని ఏర్పాటు చేయవచ్చని సూచించినట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read:ట్రంప్‌ – జెలెన్‌ స్కీ వాగ్వాదం..!

- Advertisement -