ట్రంప్‌ – జెలెన్‌ స్కీ వాగ్వాదం..!

27
- Advertisement -

అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌ స్కీ.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ దేశాధినేతలు మీడియా ముందే వాదించుకున్నారు. జెలెన్ స్కీ యుద్ధకాంక్షతో ఉన్నారంటూ ట్రంప్ అనగా దీనిపై జెలెన్ స్కీపై అసహనం వ్యక్తం చేశారు.

అంతేకాదు రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. ఒప్పందం చేసుకో లేదంటే మేము బయటకు వెళ్లిపోతాం అంటూ జెలెన్ స్కీకి ట్రంప్ తేల్చి చెప్పారు. మీరు చాలా పెద్ద సమస్యలో ఉన్నారు, మీరు గెలవలేరు అని జెలెన్ స్కీని ఉద్దేశించి ట్రంప్ అన్నారు.

Also Read:ప్రభుత్వంలో ఉన్నాం..పేదవాడి కోసం పనిచేయాలి

యుద్ధకాంక్షతో ఉన్నారు అని ట్రంప్ అనడం పట్ల జెలెన్ స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మా దేశంలో మేము ఉంటున్నామని .. ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు జెలెన్ స్కీ. లక్షల మంది జీవితాలో చెలగాటం ఆడుతున్నారు…మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది అంటూ ట్రంప్ సీరియస్ అయ్యారు. మొత్తంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -