IPL 2023:గుజరాత్ తో పంజాబ్ కు ముప్పే!

38
- Advertisement -

నేటి ఐపీఎల్ మ్యాచ్ లలో గుజరాత్ మరియు పంజాబ్ తలపడనున్నాయి. బింద్రా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7;30 నిముషాలకు ప్రారంభం కానుంది. ప్రస్తుతం గుజరాత్ పంజాబ్ చెరో రెండు విజయాలతో సమంగా ఉండడంతో నేడు జరిగే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పంజాబ్ తో పోల్చితే గుజరాత్ జట్టు కాస్త పటిష్టంగా ఉంది. హార్డ్ హిట్టర్స్, మెరుగైన బౌలర్స్ గుజరాత్ సొంతం. డేవిడ్ మిల్లర్, శుబ్ మన్ గిల్, లతో పాటు శనక, హర్తీక్ పాండ్య వంటి ఆటగాళ్లు గుజరాత్ కు ప్రధాన బలం.. ఇక బౌలింగ్ విషయంలో కూడా గుజరాత్ ఫుల్ స్వింగ్ లో ఉంది. .

ముఖ్యంగా రషీద్ ఖాన్ గత మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసి జోరు మీద ఉన్నాడు. రషీద్ ఖాన్ తో పంజాబ్ జట్టుకు ప్రమాదమే. మహ్మద్ శమి, లిటిల్ వంటి బౌలర్స్ కూడా రాణిస్తే.. గుజరాత్ కు గెలుపు నల్లేరు మీద నడకే. ఇక పంజాబ్ విషయానికొస్తే..హైదరబాద్ తో జరిగిన గత మ్యాచ్ లో ఓడిపోయినప్పటికి బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లోనూ మెరుగ్గానే కనిపించింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ శికర్ ధావన్ ఫామ్ లోకి రావడం పంజాబ్ కు కలిసొచ్చే అంశం.

టైడ్, రాజపక్ష వంటి ఆటగాళ్లు కూడా చెలరేగితే.. భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్ విభాగంలో రబడ, ఎలిస్ వంటి వాళ్ళు ఇంకా మెరుగైన గణాంకాలు నమోదు చేస్తే.. అన్నీ విభాగాల్లోనూ గుజరాత్ కు టాఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. కాగా సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం పంజాబ్ కింగ్స్ కు కలిసొచ్చే అంశం. మరి ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్తాన్ రాయఓల్స్ మద్య నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో మూడు పరుగుల తేడాతో చెన్నైపై రాజస్తాన్ విజయం సాధించింది. ఎం‌ఎస్ ధోని తనదైన ఆటతీరుతో మెరుపులు మెరిపించినప్పటికి చెన్నైకి ఓటమి తప్పలేదు. ఈ విజయంతో రాజస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -