Gold Price:ఆల్ టైం హైకి

34
gold
- Advertisement -

బంగారం ధర ఆల్ టైం హైకి చేరుకుంది. ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో 22 గ్రాముల బంగారం ధర రూ.500 మేర పెరిగి రూ.56 ,200కి చేరగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.550 పెరిగి రూ.61,310కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ. 56,350కి చేరగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.550కి పెరిగి రూ.61,460గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధర ఒక్కరోజే భారీగా పెరిగింది. కేజీ వెండిపై రూ.1000 పెరిగి హైదరాబాద్‌లో రూ. 81,400గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీపై రూ.750 పెరిగి రూ.77,350గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 2018.30 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు 25.53 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -