ఐపీఎల్ 14…టీమ్‌లు వదులుకుంటున్న ఆటగాళ్లు వీరే!

38
ipl

ఐపీఎల్ 2021ని మరింత సక్సెస్‌ ఫుల్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14వ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనుండగా ఫిబ్రవరిలో వేలాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న మినీ వేలాన్ని నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించగా ఫ్రాంఛైజీల మధ్య ఆటగాళ్ల బదిలీ ప్రక్రియ జరగనుంది. ఈ నెల 20 లోపు తమకు అవసరం లేదనుకున్న క్రికెటర్లను జట్లు వదిలేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

()కింగ్స్ ఎలెవన్ పంజాబ్…

భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవరిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ ఫిబ్రవరిలో నిర్వహించే వేలానికి గ్లేన్ మ్యాక్స్వెల్, క్రిస్ గేల్, షెల్డన్ కాట్రెల్, కరుణ్ నాయర్, మందిప్ సింగ్ లను విడిచి పెట్టనుంది.

()కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2020 లో మధ్యలో కెప్టెన్ బాధ్యతలు ఇయాన్ మోర్గాన్ కు అప్పగించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఏడాది వేలానికి తమ మొదటి కెప్టెన్ దినేష్ కార్తీక్ తో సహా అత్యధిక ధరకు కొనుగోలు చేసిన పాట్ కమ్మిన్స్ ను అలాగే కుల్‌దీప్ యాదవ్, ఆండ్రీ రస్సెల్, కమలేష్ నాగార్కోటిని వదిలేయనున్నట్లు తెలుస్తుంది.

()చెన్నై సూపర్ కింగ్స్…

ధోని న్యాయకత్వంలో 2021 లో బరిలోకి దిగనున్న చెన్నై ఈ ఏడాది వేలానికి సురేష్ రైనా, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, ఇమ్రాన్ తాహీర్, లుంగి నిగిడి ని వదులుకొనునట్లు సమాచారం.

()ఢిల్లీ క్యాపిటల్స్…

గత ఏడాది ఫైనల్ కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2021 వేలానికి పృథ్వీ షా, అజింక్య రహానే, షిమ్రాన్ హెట్మెయర్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రలను వదిలి పెట్టనుంది.

()ముంబై ఇండియన్స్…

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13 వ సీజన్ లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ 14 వ సీజన్ వేలానికి క్రునాల్ పాండ్యా, క్రిస్ లిన్, రాహుల్ చాహర్, మిచెల్ మెక్‌క్లెనాఘన్, ధవల్ కులకర్ణి లను విడిచి పేటనున్నట్లు సమాచారం.

()రాజస్థాన్ రాయల్స్…

ఐపీఎల్ 2020 లో చివరి నుండి రెండో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ భారత్-ఆసీస్ టెస్టుసెరిస్ లో జరిగిన సంఘటనల ఆధారంగా తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను అలాగే రాబిన్ ఉతప్ప, డేవిడ్ మిల్లర్, టామ్ కుర్రాన్, జయదేవ్ ఉనాద్కాట్ లను ఐపీఎల్ 2021 వేలానికి పంపించనున్నట్లు తెలుస్తుంది.

()రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…

గత ఏడాది ఐపీఎల్ లో క్వాలిఫైయర్స్ లోకి అడుగు పెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ఉమేష్ యాదవ్, ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీ వంటి సీనియర్ ఆటగాళ్లను వదులుకోనుంది.

()సన్‌రైజర్స్ హైదరాబాద్..

ఐపీఎల్ 2020 లో టాప్ ౩లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఫిబ్రవరిలో జరిగే వేలానికి గత ఏడాది ఆటకట్టుకొని మనీష్ పాండే, విజయ్ శంకర్, మొహమ్మద్ నబీ, ఖలీల్ అహ్మద్, జానీ బెయిర్‌స్టో వంటి ఆటగాళ్లను విడిచిపెట్టనునట్లు సమాచారం.