టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..

84

ఐపీఎల్ 2021లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడయంలో ఈరోజు రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్‌ జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికేనన్న నేపథ్యంలో ఆర్సీబీ, కేకేఆర్‌ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ప్రత్యర్థి ముందు భారీ స్కోరు నిర్దేశించాలని ఆర్సీబీ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. నేటి మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఏలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, నేటి ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది.