లాక్‌డౌన్‌లో అనేక రంగాల్లో మార్పులు: హరీశ్‌ రావు

26
harish

క‌రోనా లాక్‌డౌన్‌తో విద్యా రంగంతో పాటు ప‌లు రంగాల్లో అనేక మార్పులు వ‌చ్చాయ‌న్నారు మంత్రి హరీశ్‌ రావు. ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల టీచ‌ర్ల‌కు ఆన్‌లైన్ బోధ‌నా ప‌ద్ధ‌తుల‌పై పోటీలు నిర్వ‌హించారు. ఈ పోటీల్లో ఉత్త‌మ నైపుణ్యం క‌న‌బ‌రిచిన టీచ‌ర్ల‌కు మంత్రి హ‌రీష్ రావు దృవీక‌ర‌ణ ప‌త్రాలు అంద‌జేసి అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అవుతున్న‌ప్ప‌టికీ టీచ‌ర్లు మాత్రం ఆన్‌లైన్ బోధ‌న‌ను కొన‌సాగించాల‌న్నారు. విద్యార్థుల భ‌విష్య‌త్ త‌ర‌గ‌తి గ‌దుల్లోనే నిర్మిత‌మ‌వుతోంద‌న్నారు. విద్య అనేది ఉద్యోగం కోసం కాకుండా, నైతిక విలువ‌లు నేర్పేలా ఉండాల‌న్నారు.

ల‌య‌న్స్ క్ల‌బ్ బోధనా ప‌ద్ధ‌తుల‌పై టీచ‌ర్ల‌కు పోటీలు నిర్వ‌హించ‌డం అద్భుత‌మ‌ని కొనియాడారు. టీచ‌ర్లు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించ‌డం ఒక ఛాలెంజ్ అని అన్నారు. . సామాజిక స్పృహ క‌లిగించేలా బోధ‌న ఉండాల‌ని సూచించారు.