ఐపీఎల్ 13..రాణించిన ప్రియం గార్గ్

116
srh

ఐపీఎల్‌-13లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 164 పరుగులు చేసింది.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బెయిర్ స్టో పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు.

వార్నర్ 28,మనీశ్ పాండే 29,కేన్ విలియమ్సన 9 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టగా యువ భారత ఆటగాళ్లు అంచనాల్ని మించి రాణించారు. ప్రియం గార్గ్‌(51 నాటౌట్: 26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌ ), అభిషేక్‌ శర్మ(31: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు.

వీరిద్దరు చివర్లో రాణించడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌(2/31) రెండు వికెట్లు తీయగా శార్దుల్‌ ఠాకూర్‌, పియూశ్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు.