ఐపిఎల్ 11వ సిజన్ లో మొదటి ఘట్టం ముగిసింది. నిన్నటితో ప్లే ఆఫ్ మ్యాచ్ లు ముగియడంతో రేపటి నుంచి క్యాలీఫైర్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మొత్తం 8టీంలలో నుంచి 4టీం లు పెవిలియన్ కు చేరాయి. రేపటి నుంచి క్యాలిఫైర్ మ్యాచ్ లు జరుగుతుండటంతో ఇరు జట్లు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. తొలి క్యాలీఫైర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లడంతో ఇరు టీంలలో గట్టి పోటీ ఏర్పడనుంది.
ఎలాగైనా మరోసారి కప్ ను సొంతం చేసుకొవాలనే కసితో ఉన్నారు హైదరాబాద్ ప్లేయర్లు. ఎక్కువ ఒత్తిడికి లోనవకుండా బౌలింగ్, ఫిల్డింగ్ ను నమ్ముకుని గేమ్ ను ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ ఆటగాళ్లు. ఇక చైన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల తర్వాత మళ్ళి బరిలోకి దిగి తన సత్తా ఎంటో చూపిస్తున్నారు చైన్నై ఆటగాళ్లు. ఇప్పటివరకూ చైన్నై హైదరాబాద్ రెండు సార్లు ఢికొట్టగా రెండు సార్లు చైన్నై గెలవడంతో హైదరాబాద్ ప్లేయర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక రెండు జట్లలో సీనియర్ ఆటగాళ్లతో పాటు జూనియర్ ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.
ఈనేపథ్యంలో ఇరుజట్ల మధ్య సాగే పోరు ఆసక్తికరంగా మరనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చైన్నై సన్ రైజర్స్ బౌలర్ల దాటికి తట్టుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈతొలి క్యాలీఫైర్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోగా…ఓడిపోయిన జట్టుకు చివరి అవకాశంగా ఎలిమినేటర్ మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఇస్తారు. రేపు జిరిగే తొలి క్యాలీఫైర్ మ్యాచ్ లో ఎవరు ఫైనల్ కు వెలతారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.