నా అనుమతి లేకుండా ఎలా వేస్తారు..?

525
Rashmi express anger for using her photo
- Advertisement -

హాట్ యాంకర్ రష్మి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి యాంకర్‌గా దూసుకుపోతోంది. ‘జబర్దస్త్’ షోతో అందరిని ఆకట్టుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటు బుల్లితెరపై రాణిస్తూనే అటు సినిమాల్లో వచ్చే అవకాశాలను ఒడిసిపట్టుకుంటోంది. గతంలో రష్మి ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రంలో గ్లామర్ పాత్రలో నటించి తన నటన, అభినయంతో కుర్రకారును ఓ రేంజులో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అవకాశాలు వచ్చిన పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.

Rashmi express anger for using her photo

‘గుంటూరు టాకీస్’ సినిమా తర్వాత తెలుగులో యంగ్ హీరోల సరసన అవకాశాలు వస్తాయనుకున్నా దరిచేరలేదు. తాజాగా ఈ అమ్మడు ఓ ఈవెంట్‌కు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల‌తో క‌లిసి ర‌ష్మి హాజ‌ర‌వుతోందంటూ కొందరు నిర్వాహకులు ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన రష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. `నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా వేస్తారని ప్రశ్నించింది. ఈ ఈవెంట్ గురించి న‌న్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదని, ఇలా నా అనుమ‌తి లేకుండా నా ఫోటో వేయడం అనేది సరైంది కాదన్నారు. ఫోటోలు వేసే ముందు సద‌రు సంస్థ‌ల సెలబ్రిటీల అంగీకార పత్రాల గురించి చెక్ చేయాలని నిర్వాహకులపై ఘాటుగా స్పందించింది.

- Advertisement -