వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోని!

31
- Advertisement -

ఈ ఏడాది ఐపీఎల్‌ మహేంద్ర సింగ్ ధోనికి ఇది చివరి ఐపీఎల్‌? అంటే అది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. గాయంతో బాధపడుతున్న మహీ సర్జరీ అనంతరం కోలుకున్నాకా? రిటైర్మెంట్‌పై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోండగా సీఎస్‌కే మేనేజర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ధోని రిటైర్మెంట్‌పై మా దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఇది కేవలం మహీ మాత్రమే చెప్పగలిగే సమాధానం అన్నారు. ధోని ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానిని గౌరవిస్తామని చెప్పారు. ధోని రిటైర్మెంట్‌పై చర్చ అవసరం లేదని తగిన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తారని వెల్లడించారు.

అయితే ధోని వచ్చే సీజన్లో ఆడతారని మేము ఆశాభావంతో ఉన్నాం అభిమానులు కూడా ఇదే కోరుకుంటారు అంటూ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -