ఇండిగో బంపర్‌ ఆఫర్‌ @999

185
IndiGo

‘ఫెస్టివల్‌ సేల్‌’ పేరిట ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణీకులకు భారీ ఆఫర్‌నిచ్చింది. ఈ ‘ఫెస్టివల్‌ సేల్‌’ ఆఫర్‌ ను నేటి నుంచే ప్రారంభించింది.

రూ.999 తో అతి తక్కువ ప్రారంభ ధరతో టికెట్ల అమ్మకాలను ప్రారంభించినట్టు ఇండిగో ముఖ్య వాణిజ్య అధికారి విలియం బౌల్టర్‌ పేర్కొన్నారు. ఈ ఆఫర్‌ నాలుగు రోజులపాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

IndiGo

కాగా.. ఈ నెల 18 నుంచి 2019 మార్చి 30 మధ్య ప్రయాణించే నిమిత్తం ఈ ఆఫర్ ను ప్రకటించారు. ఇక ఇండిగో ప్రకటించిన ఈ ఆఫర్‌ కారణంగా ప్రయాణీకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని భావిస్తున్నట్టు విలియం పేర్కొన్నారు.

మొబైల్ వాలెట్ మొబిక్విక్ నుంచి అయితే దాదాపు రూ.600 వరకూ ఇరవై శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. దాదాపు పది లక్షల టికెట్లను విక్రయించే లక్ష్యంతోనే అతి తక్కువ ప్రారంభ ధరతో టికెట్ల అమ్మకాలను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. కాగా..ఈ విధంగా టికెట్లు అమ్మడం ద్వారా మరిన్ని లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.