విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా ట్రైల‌ర్..?

292
NOTA
- Advertisement -

సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు. ఈ యంగ్‌ హీరో లేటెస్ట్‌ మూవీ ‘నోటా’. ఈ ద్విభాషా మూవీ విడుద‌ల‌కు రెడీ అయింది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చేయ‌న‌టువంటి భిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు విజ‌య్‌.

మెహ్రీన్ కౌర్ ఇందులో విజ‌య్ కు జోడీగా న‌టిస్తుంది. స‌త్య‌రాజ్, నాజ‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటా చిత్రాన్ని జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియెట్రిక‌ల్ ట్రైల‌ర్ సెప్టెంబ‌ర్ 6.. సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న ఈ మూవీని అక్టోబ‌ర్ లో సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

- Advertisement -