మూడో విజయం నమోదు చేసుకున్న భారత్‌

379
- Advertisement -

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20వరల్డ్‌ కప్‌ లో భారత్‌ మూడో విజయంను నమోదు చేసుకుంది. ఆడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు ఉత్కంఠ రేపింది. ఆట మధ్యలో కొంత సేపు వర్షం పడిన…తిరిగి మ్యాచ్‌ను కొనసాగించింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ విఫలం కాగా కేఎల్‌ రాహుల్‌(50) మాత్రం తన ఫామ్‌ను అందిపుచ్చుకొని అర్ధశతకం సాధించాడు. స్టార్ బ్యాటర్‌ విరాట్‌ (64) తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి హాఫ్‌ సెంచరీ నమోదు చేశారు. ఆఖర్లో అశ్విన్‌ (13) ధాటిగా ఆడాడు. సూర్యకుమార్‌ (30) పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో హసన్‌ 3, షకిబ్‌ 2 వికెట్లు పడగొట్టారు.

185 పరుగుల చేధన కోసం మైదానంలోకి బంగ్లా బ్యాటర్లు ఓపెనర్లు ఇద్దరు దాటిగా ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకోల్పారు. దీంతో 7వ ఓవర్‌ ముగిసేనాటికి వర్షం కారణంగా ఆటను కొంత సేపు విరామం ప్రకటించారు. వర్షం అంతారయం నాటికి ఏడు ఓవర్లకు బంగ్లా వికెట్‌ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. అయితే మ్యాచ్‌ వర్షం తగ్గడంతో తిరిగి ప్రారంభమైంది.

మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించి బంగ్లాదేశ్‌ టార్గెట్‌ను 151పరుగులుగా అంపైర్లు ఫిక్స్‌ చేశారు. దీంతో ఇంకా బంగ్లా 54 బంతుల్లో 85పరుగులు చేయాలి. తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో లిట్టన్‌ అనవసరమైన పరుగుకు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. వెనువెంటనే మరో ఓపెనర్‌ షాంటో కూడా పెవిలియన్‌కు చేరాడు.

అయితే బంగ్లాదేశ్‌ 145 పరుగులకు మాత్రమే పరిమితం చేయడంలో హర్దిక్‌ పాండ్యాకు(2), ఆర్షదీప్‌ సింగ్‌(2) విజయం సాధించారు. షమీకి 1వికెట్‌ దక్కింది. దీంతో భారత్‌ 5పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

ముసలవ్వకు చెప్పులు తొడిగిన రాహుల్‌

ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో లైవ్ కవరేజ్..

టీ20 కెప్టెన్‌గా హార్ధిక్

- Advertisement -