- Advertisement -
దేశంలో కరోనా ఉదృతి మళ్ళీ కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. 37,028 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా గడచిన 24 గంటల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,93,021 మంది కోలుకున్నారు. 5,40,720 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సిన్లు వేశారు.
- Advertisement -