మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

222
Petrol
- Advertisement -

దాదాపు నాలుగు రోజుల విరామం తరువాత మళ్లీ పెట్రోలు ధరలు స్వల్పంగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 30) స్వల్పంగా తగ్గాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలుపై 22 పైసలు, డీజిల్ పై 23 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి.

మారిన ధరలు ఇలా ఉన్నాయి…

న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 90.56కు తగ్గగా, డీజిల్ ధర లీటరుకు రూ. 80.87కు చేరింది.
హైదరాబాదులో పెట్రోలు ధర లీటరుకు రూ. 94.16, డీజిల్‌ రూ. 88.20కు చేదింది.
అమరావతిలో పెట్రోలు ధర రూ. 96.77, డీజిల్‌ ధర రూ. 90.28కు తగ్గింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.98గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 87.96కు చేరుకుంది.
కోల్‌ కతాలో పెట్రోల్‌ రూ. 90.77గా, డీజిల్ ధర రూ 83.75గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.58కు, డీజిల్ ధర రూ. 85.88 22కు తగ్గింది.

- Advertisement -