పవర్‌ స్టార్‌పై మెగా పవర్‌ స్టార్‌ ప్రశంసలు..

203
- Advertisement -

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. పవన్, శ్రుతిహాసన్ జంటగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. ట్రైలర్ ట్రెంగ్‌లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌పై మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ స్పందించాడు. “బాబాయ్… మైండ్ బ్లోయింగ్” అంటూ ట్రైలర్‌పై వ్యాఖ్యానించాడు. “ఎప్పట్లాగానే పవర్ ఫుల్ గా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు.

కాగా ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 3.8 మిలియన్లకు పైగా వ్యూస్, 6.82 లక్షలకు పైగా లైక్స్ అందుకోవడం విశేషం. ట్రైలర్ కే ఇలావుంటే సినిమా రిలీజైతే అభిమానుల స్పందన ఇంకెంత భారీగా ఉంటుందో చూడాలి. బాలీవుడ్‌లో హిట్టయిన ‘పింక్’ చిత్రాన్ని పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -