- Advertisement -
దేశంలో గత 24 గంటల్లో 12,194 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11,106 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 92 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,642 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,11,731 మంది కోలుకున్నారు. 1,37,567 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 82,63,858 మందికి వ్యాక్సిన్ వేశారుని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.
- Advertisement -