కేంద్రం…సర్వైకల్ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌

63
- Advertisement -

భారతదేశంలో చాపకింద నీరులా స్త్రీలకు సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌) విస్తరిస్తున్న నేపథ్యంలో…9 నుంచి 14యేళ్లలోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌లను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. సర్వైకల్ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిజీసీఏ సీరం ఇన్‌స్టిట్యూట్‌కు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని ఆదేశించింది.

టీకాలు వేయడానికి పాఠశాల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ సెంటర్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. ఇందుకు అనుగుణంగా పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల యాజమాన్య బోర్డులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్‌ ఎన్‌కే ఆరోరా మాట్లాడుతూ… భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 80వేల గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదువుతున్నాయని తెలిపారు. 24గంటల్లో సర్వైకల్ క్యాన్సర్‌ కారణంగా దేశవ్యాప్తంగా 95-100మంది మహిళలను కోల్పోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రతి జిల్లాలో 5 నుంచి 10వ తరగతి వరకూ బాలికల సంఖ్యను క్రోడీకరించాలని భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

వ్యాక్సిన్‌ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా కేంద్రం యూ-విన్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సర్వైకల్ క్యాన్సర్‌ నివారణకు హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) CERAVAVAC వ్యాక్సిన్ వచ్చే యేడాది ఏప్రిల్‌ నాటికి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దేశంలోని బాలికలకు కమ్యూనిటీ ఔట్‌ రీచ్ ముబైల్‌ టీమ్స్ ద్వారా టీకాలు అందించాలని కేంద్ర నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి…

ఆక్సిజన్ స్టాక్‌ తప్పనిసరి..కేంద్రం సూచన

ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం

దానిమ్మతో ఆరోగ్యం…

- Advertisement -