వీరసింహారెడ్డికి రెండు ఈవెంట్ లు !

66
- Advertisement -

నటసింహం బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేట్స్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ లో రోజురోజుకు సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఆ పెరుగుతున్న ఆసక్తికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఓ కారణం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఫంక్ష‌న్ ఏదీ హైద‌ర‌బాద్‌లో ప్లాన్ చేయ‌ట్లేదని టాక్.

రెండు ఈవెంట్లు చేయ‌నుండ‌గా ఒక‌టి అనంతరపురం లో, మ‌రొక‌టి గుంటూరు లో ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి హైద‌రాబాద్‌లో వీరసింహా రెడ్డి ఈవెంట్ లేద‌ని తేలిపోయింది. అనంతపురంలో జరిగే ఈవెంట్ లో బాలయ్యతో పాటు కొందరు యంగ్ హీరోలు కూడా ఈ ఈవెంట్ కి హాజరు అవుతారట. వీరసింహా రెడ్డి సినిమా పై హైప్‌ ను మ‌రింత పెంచేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చాలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయనున్నారు.

ఇక ఇప్పటికే వీరసింహా రెడ్డి సినిమా నుంచి రిలీజైన ప్ర‌తీ కంటెంట్ ప్రేక్ష‌కులకు అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. అన్నిటికీ మించి ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. పైగా ఈ సినిమాతో ఐయామ్ బ్యాక్ అంటూ బాలయ్య మాస్ స్టెప్స్ వేశాడు. పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయట. అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -