దేశంలో 24 గంటల్లో 26,382 కరోనా కేసులు

99
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువయ్యాయి. గత 24 గంటల్లో 26,382 కరోనా కేసులు నమోదుకాగా 397 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,32,548కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,32,002 యాక్టివ్ కేసులుండగా 94,56,449 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,44,096కి చేరింది.