బిగ్ బాస్ 4..ఎపిసోడ్ 101 హైలైట్స్

52
srimukhi

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 101 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 101 ఎపిసోడ్‌లో భాగంగా మాజీ కంటెస్టెంట్స్‌ని రంగంలోకి దించి ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. శ్రీముఖి,అలీ రెజా,హరితేజ కంటెస్టెంట్స్ తో మాట్లాడారు.

తొలుత శ్రీముఖి మాట్లాడుతూ.. మేం బయటకు వెళ్తే సీజన్ 2లో గీతా మాధురి, సీజన్ 3లో నేను వేసుకున్న టాటూలు నిజమా? కాదా? ఫేక్‌నా లేక అవి గ్రాఫిక్స్‌నా అని అడుగుతున్నారని తెలిపారు. సీజన్ 1లో కూడా బిగ్ బాస్ టాటూ వేయించుకోవాలని అంటే.. హరితేజ వేయించుకునేదేమో అని చెప్పింది శ్రీముఖి.

నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్ర‌శ్న‌కు సోహైల్‌ త‌న కోపాన్ని కూల్ చేయ‌గ‌లగాలి అని చెప్పాడు. ఇది జ‌ర‌గ‌ని ప‌ని అని హ‌రితేజ కుండ బ‌ద్ధలు కొట్టింది. మోనాల్ వెళ్లాక సైలెంట్ అయ్యావేంట‌ని అఖిల్‌ను కూపీ లాగేందుకు ప్ర‌య‌త్నించ‌గా సోహైల్ మ‌ధ్య‌లో లేచి అంత లేదంటూ, ఇక్క‌డ ఇద్ద‌రికి సోపులేస్తున్నాడ‌ని పంచ్ వేశాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక కాసేప‌టివ‌ర‌కు ఊపిరి ఆడ‌లేద‌ని అఖిల్ చెప్పుకొచ్చాడు.

నీ ఎద‌లో నాకు చోటే వ‌ద్దు.. అంటూ బాగానే పాడాడు అభిజిత్. త‌ర్వాత అలీ రెజా మాట్లాడుతూ..న‌న్ను అర్జున్‌రెడ్డి అనేవారు, కానీ నువ్వు న‌న్ను మించిపోయావ‌ని సోహైల్‌ను మెచ్చుకున్నాడు. త‌న కోపం కార‌ణం లేకుండా రాద‌ని, ఎంత కోప్ప‌డినా మ‌ళ్లీ మ‌న‌వాళ్లే అని ద‌గ్గ‌ర‌కు తీసుకుంటా అని సోహైల్ చెప్ప‌గా ఇలా కోప్ప‌డే ఒక‌రు బిగ్‌బాస్ 1 ట్రోఫీని ప‌ట్టుకెళ్లార‌ని హ‌రితేజ శివ‌బాలాజీని గుర్తు చేసింది.

చివ‌ర్లో మాకు స‌ల‌హాలు ఇవ్వండ‌ని జూనియ‌ర్లు సీనియ‌ర్ల‌ను కోరారు. మొదట హ‌రితేజ మాట్లాడుతూ… ఇక్క‌డిదాకా వ‌చ్చాక మార్చుకోవాల్సిన‌వేమీ ఉండ‌వ‌ని చెప్పింది. శ్రీముఖి మాట్లాడుతూ గ‌త సీజ‌న్‌లో నేను సెట్‌లో ప్ర‌తి మూల‌మూల‌కు వెళ్లాను. ఎందుకంటే త‌ర్వాత‌ ఆ సెట్ తీసేస్తారు. కాబ‌ట్టి మీరు కూడా హౌస్‌లో చిల్ అవ్వండి అని తెలిపింది. అనంత‌రం మాజీలు టాప్ 5 కంటెస్టెంట్ల‌కు ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడ్కోలు ప‌లికారు.