దేశంలో 36 లక్షలు దాటిన కరోనా కేసులు…

186
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 80 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో 78,512 క‌రోనా కేసులు నమోదుకాగా 971 మంది క‌రోనాతో మృతిచెందారు.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 36,21,246 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 7,81,975 యాక్టివ్ కేసులున్నాయి. 27,74,802 మంది కరోనా బాధితులు కోలుకోగా 64,469 మంది బాధితులు మృతిచెందారు.

24 గంటల్లో 8,46,278 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా ఆగ‌స్టు 30 వ‌ర‌కు 4,23,07,914 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ఐసీఎంఆర్ తెలిపింది.