24 గంటల్లో 1873 కరోనా కేసులు…

138
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 1,873 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,24,963కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 కరోనా కేసులుండగా 92,837 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 827 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 0.66శాతం మరణాల రేటు ఉండగా, దేశంలో 1.78శాతంగా ఉందని పేర్కొంది.

24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 360 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా రంగారెడ్డి 129, ఖమ్మం 103, నిజామాబాద్‌ 94, వరంగల్‌ అర్బన్‌ 94 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 73.3శాతంగా ఉందని చెప్పింది.