దేశంలో తొలిసారి 4 లక్షలు దాటిన కరోనా కేసులు…

41
corona

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 మందికి కరోనా పాజిటివ్‌ నమోదుకాగా 3523 మంది మృతిచెందారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969కు చేరగా 1,56,84,406 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,11,853 మంది మరణించారు. ఇప్పటివరకు 15,49,89,635 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది. ఏప్రిల్‌ 30 నాటికి 28,83,37,385 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి.