రాష్ట్రంలో 24 గంటల్లో 7,754 కరోనా కేసులు..

15
corona

రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. గత 24 గంటల్లో 7,754 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 51 మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. ఇప్పటి వరకు 3,62,160 మంది కోలుకోగా మొత్తం మృతుల సంఖ్య 2,312కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్‌ కేసులున్నాయి.

రాష్ట్రంలో మరణాల రేటు 0.52శాతంగా ఉండగా రికవరీ రేటు 81.68 శాతంగా ఉంది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,507, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 630, రంగారెడ్డిలో 554, సంగారెడ్డిలో 325, కరీంనగర్‌లో 281, మహబూబ్‌నగర్‌లో 279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.