వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు..

64
corona

వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకేరోజు రికార్డు స్ధాయిలో 2.5 కోట్ల మందికి టీకాను వేసిందని ….ఇది సరికొత్త రికార్డని అర్థ‌రాత్రి 11.58 నిమిషాల‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ట్విట్ట‌ర్‌ ద్వారా విషయాన్ని వెల్ల‌డించారు.

శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు ఇండియాలో ఒకే రోజు వ్యాక్సినేష‌న్ రెండు కోట్లు దాటిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు చెందిన సౌత్ ఈస్ట్ ఏషియా ఆఫీసు త‌న ట్వీట్‌లో తెలిపింది. ఈ సందర్భంగా భారత్‌కు డ‌బ్ల్యూహెచ్‌వో కంగ్రాట్స్ తెలిపింది. ఇక శుక్ర‌వారం రోజున ప్ర‌ధాని మోదీ 71వ పుట్టిన రోజు కావ‌డం విశేషం.

రికార్డు స్థాయిలో వ్యాక్సినేష‌న్ జ‌రిగిన తీరు ప‌ట్ల ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వంగా ఉన్న‌ట్లు చెప్పారు ప్రధాని మోదీ.