సాయుధ పోరాటంతో బీజేపీకి ఏం సంబంధం: గుత్తా

99
gutha
- Advertisement -

చారిత్రాక తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా…సెప్టెంబర్ 17ను బీజేపీ ఒక ఆట వస్తువులా మార్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతుందని…ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బీజేపీ పార్టీ హిందుత్వాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నిస్తుందని….ఎంఐఎం పార్టీని బూచిగా చూపెట్టి హిందువులను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆ పార్టీకి స్థానం లేదన్నారు.

కాంగ్రెస్ కూడా సెప్టెంబర్‌ 17 గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నదని, ఇది సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఆయన బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడరన్నారు.

- Advertisement -