వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు తిరుగులేదు. ఇప్పటివరకు పాక్‌పై ఓటమి ఎరుగని భారత్ ఆ రికార్డును పదిలంగా ఉంచుకుంది. పాక్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత్: 30.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది. రోహిత్ శర్మ 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 63 బంతుల్లో 86 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా రోహిత్ బాధుడు ముందు లక్ష్యం చిన్నబోయింది. ఇక పాక్ బౌలర్లైతే ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్..42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50), మహమ్మద్ రిజ్వాన్ (49) పరుగులు చేశారు. ఒక దశలో 155/2తో పటిష్ట స్థితిలో కనిపించిన పాక్.. తర్వాత 36 పరుగులకే మిగితా 8 వికెట్లు కొల్పోయింది.
ప్రపంచకప్‌లో భారత్‌కి ది మూడో విజయం కాగా.. ఈ ఫలితంతో టీమ్‌ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read:సైంధవ్ రైట్స్ భారీ రేటుకి!