Ind Vs Pak:పాక్ పై భార‌త్ ఘ‌న విజ‌యం..

61
- Advertisement -

దాయాదుల పోరులో పైచేయి సాధించింది భారత్. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాకిస్థాన్ విధించిన 242 పరుగుల టార్గెట్‌ను 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కొల్పోయి చేధించింది.

విరాట్ కోహ్లీ (100 నాటౌట్)గా నిలిచి ఫామ్‌లోకి రాగా శ్రేయ‌స్ అయ్య‌ర్ (56), శుభ్‌మ‌న్ గిల్ (46), రోహిత్ శ‌ర్మ (20) పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఖుష్‌దిల్ షా లు చెరో ఓ వికెట్ సాధించారు.

అంత‌క ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవ‌ర్ల‌లో 241 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సౌద్ ష‌కీల్ ( 62) , మహ్మద్ రిజ్వాన్ (46), ఖుష్‌దిల్ షా (38) ,బాబ‌ర్ ఆజామ్ (23) పరుగులు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు,హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read:ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు?: కేటీఆర్

- Advertisement -