రాందేవ్‌ బాబాపై ఐఎంఏ ఆగ్రహం..

48
Ramdev baba

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి(ఆధునిక ఇంగ్లీషు వైద్య విధానం)పై యోగా గురు రాందేవ్ బాబా ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అల్లోపతి విఫలమైందని, అదో పనికిమాలిన వైద్యమని, ఆ వైద్య విధానం పనిచేయకపోవడం వల్లనే ఇన్ని లక్షల ప్రాణాలు పోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాందేవ్ కామెంట్స్‌పై ఐఎంఏ శనివారం తీవ్ర స్పందించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాందేవ్ బాబా మాటలు ఉన్నాయని, ఆయనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రతి రోజూ ఎన్నో లక్షల మంది డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారందరి శ్రమను రాందేవ్ చాలా చులకనగా మాట్లాడారని, ఇది క్షమార్హం కాదని పేర్కొంది.