మెగా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయట్లేదట….

103

తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రానా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తన చిన్ననాటి స్నేహితులైన మెగా ఫ్రెండ్స్.. అల్లు అర్జున్.. రాం చరణ్ కు ఫోన్లు చేయకూడదని తాను డిసైడ్ అయినట్లుగా చెప్పాడు. క్లోజ్ ఫ్రెండ్సే అయినప్పటికీ డిస్ట్రబ్ చేయటం తనకిష్టం లేదని చెప్పాడు. ఉన్నట్లుండి రానాకు.. అలా ఎందుకనిపించిందంటారా? ….

బన్నీకి.. చెర్రీకి పెళ్లి అయినప్పటి నుంచి.. వారికి ఫోన్ చేయాలంటే చాలు.. వారు ఫ్యామిలీతో బిజీగా ఉంటారని.. అలాంటిది తాను ఫోన్ చేస్తే డిస్ట్రబ్ అవుతుందన్న భావన కలిగేదట. ‘‘ఫస్ట్ టైమ్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రామ్ చరణ్.. అల్లు అర్జున్ కు పెళ్లి అయినప్పుడు వచ్చింది. మనకూ ఓ అమ్మాయి దొరకితే బాగుంటుందనుకున్నా.

I Don't Want To Disturb Mega Cousins

కానీ.. దొరకలేదు. అంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్లిద్దరికి ఫోన్ చేసేవాడ్ని. పెళ్లి అయ్యాక.. ఏమో వైఫ్ తోఎక్కడికైనా వెళ్లారేమో.. ఫోన్ చేయొచ్చో.. లేదో..’’ అనుకోవటం మొదలెట్టా. పెళ్లైనోళ్లతో వర్క్ వుట్ కావట్లేదని.. నాకన్నా వయసులో చిన్నోళ్లతో ఫ్రెండ్ షిప్ చేయటం మొదలెట్టా. పెళ్లి అయినోళ్లు ఖాళీగా ఉంటే వాళ్లే ఫోన్ చేస్తారుగా’’ అంటూ అసలు విషయాన్ని చెప్పేశాడు.

ప్రస్తుతం తన జీవితం ఒక క్రమపద్దతిలో సాగడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం వల్ల లైఫ్ పార్ట్ నర్ తో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతానికి పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు రానా తెలిపారు.