రాంచరణ్ ఇంత పిసినారా…!

98
ram-charan

చిరంజీవి రీఎంట్రీ చిత్రం.. ఖైదీనంబర్ 150 మూవీ సెట్స్ పైకి వెళ్లినప్పటి నుండి ఏదో ఒక గందరగోళం నడుస్తూనే ఉంది. ఒకసారి నటీనటుల విషయంలో..మరోసారి టైటిల్ విషయంలో.. ఇలా ఎప్పుడూ ఏదో వార్త బయటకు వస్తూనే ఉంది.

నటీనటుల విషయంలో అయితే ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేకున్నాయి. బాలీవుడ్ భామను హీరోయిన్ గా తీసుకుంటారని, హస్యనటుడిగా సునీల్ నటిస్తున్నాడని, విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటిస్తుందని ఇలా ఎన్నో వార్తలు వినిపించాయి. ఐటెం సాంగు విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే జరిగింది.

Khaidi No 150
కేథరీన్ ఫైనల్ అయ్యాక..అనూహ్యంగా లక్ష్మీరాయ్ ను ఆమె ప్లేస్ లో భర్తీ చేశారు. అయితే దీనంతటికీ బడ్జెట్త గ్గించుకోవాలని చరణ్ భావించడమే కారణమని తాజాగా గుసగుసలువినిపిస్తున్నాయి. సినిమాకు తీసుకున్న నటీనటులంతా ప్రాముఖ్యం ఉన్నవారే అయినా.. వారికి ఇచ్చే పారితోషికం విషయంలో చరణ్ పిసినారిలా వ్యవహరిస్తున్నాడని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

ముందుగా చేసున్న ఒప్పందం ప్రకారం కాకుండా.. నటీనటులకు ఇవ్వాల్సిన పారితోషికంలో 35 శాతంకోత విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరిగినా.. నటీనటులంతా చిరంజీవి మోహం చూసి, మిన్నకుండిపోయారట.

Khaidi No 150

నిర్మాతగా చరణ్ కు అనుభవం లేకపోవడంతోనే,ఖర్చుపెట్టే విషయంలో సాహసం చేయలేకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. గతంలోబాహుబలి తొలిపార్టులో నటించిన నటీనటులకు కూడా నిర్మాతలు ఇలాగే పారితోషికాలను ఎగ్గొట్టారు.