అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు చిరు మాస్‌ డాన్స్‌…..

108
Khaidi No 150 Movie Ammadu lets do Kummudu

ఇప్పటికే టీజర్ తో రికార్డులను ఇరగ్గొట్టేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు మూవీలోని ఓ పాటను రిలీజ్ చేశారు. అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు.. అంటూ సాగే సింగిల్ ని ఇస్తామని చెప్పిన యూనిట్.. అందుకు తగ్గట్లుగానే ఆడియో కంపెనీ ద్వారా పాటను రిలీజ్ చేశారు.

‘దిస్ ఈజ్ నాట్ మాస్ సాంగ్.. దిసీజ్ బాస్ సాంగ్’ అంటూ దేవిశ్రీ వాయిస్ తో మొదలయ్యే పాట.. ఆ తర్వాత ఏ స్టేజ్ లోనూ కొంచెం కూడా స్లో అవదు. అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు.. అని హీరో అంటే… పిల్లడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ హీరోయిన్ మరింత రెచ్చగొట్టేస్తుందన్న మాట. సాంగ్ లోని స్టిల్స్ తోనే పాటను వీడియో రూపంలో విడుదల చేయడంతో మరింత ఆకర్షణ వచ్చేసింది. చిరంజీవి డ్రెస్సులు-స్టైలింగ్ కానీ.. కాజల్ అందాలు-చిందులు ఈ పాటలో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

Khaidi No 150 Movie Ammadu lets do Kummudu

మెగాస్టార్ స్వయంగా ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అంటూ పాటను ఫినిష్ చేయడం చాలా అదర్స్‌ అంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాంచరణ్ నిర్మాతగా, వి.వి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13, 2017న విడుదల కాబోతుంది.

Khaidi No 150 Songs | AMMADU Lets Do KUMMUDU - Full Song With Lyrics | Chiranjeevi, Kajal | DSP