వర్మకు వెటకారం ఎక్కువ..చిరు

98
chiru

ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ తో ముదిరిన నాగబాబు..వర్మ వివాదంలో చిరంజీవి తనదైన రీతిలో స్పందించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడటం వేస్ట్ అని చిరు అన్నారు. ఈ వివాదంపై ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ప్రశ్నకి చిరు ఇలా స్పందించారు. అతడు చాలా టిపిక్ క్యారెక్టర్. ఎప్పుడు దేనికి గురించి మాట్లాడతారో ఎవరికి తెలియదు. అతనికి కొంచెం ఎటకారం అని ఒకళ్లను పొగడాలంటే పొగడచ్చు గానీ, అందుకోసం రెండోవాళ్లను కించపరచడం సరికాదని, రాంగోపాల్ వర్మ అలాగే చేస్తారని అన్నారు. వర్మ కుచ్చితతత్వం గల మనిషి చిరు విమర్శించారు.

chiru

వర్మ కుత్సితంగా ఆలోచిస్తారని, తన సినిమా పోస్టర్లు విడుదల చేసినప్పుడు అందులోని లుంగీ స్టిల్ గురించి చాలా ఘోరంగా కామెంట్ చేశారని, అది మంచిపద్ధతి కాదని చెప్పారు. ఆయన చాలా మేధావి అని, తన ఆలోచనలను సక్రమంగా ఉపయోగించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది గానీ ఇలా కామెంట్లు చేయడం తగదని అన్నారు. నాగబాబు మనసులో ఏదీ దాచుకోలేడని, అందుకే ప్రీ లాంచ్ వేడుక సందర్భంగా రాంగోపాల్ వర్మ గురించి గట్టిగా మాట్లాడాడని తెలిపారు. పవన్ కల్యాణ్ గురించి కూడా వర్మ పలు విమర్శలు చేశాడని, ఆయన ఎవరినీ వదలట్లేదని చెప్పారు.